Covid Fourth Wave Effect: భారత్‌లో కరోనా డేంజర్‌ బెల్స్‌

18 Jun, 2022 11:01 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతోంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేవంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది మృతిచెందారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరుకుంది. ఇక మరణించిన వారి సంఖ్య 5,24,840కి చేరింది. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,90, 845కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 00,42,768 మందికి కరోనా వ్యాక్సిన‍్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. 

మరోవైపు.. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(శుక‍్రవారం) తెలంగాణలో 27,841 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 279 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 172 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇక, మేడ్చల్‌లో 20, రంగారెడ్డిలో 62, కరీంనగర్‌లో 4 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 1,781 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు