ప్రతి 3 నిమిషాలకు ఓ ఇద్దరు..

17 Aug, 2020 14:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరిస్తోంది. నానాటికి వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికి ఈ వైరస్‌ కారణంగా దేశంలో ప్రతీ రోజు ప్రతి మూడు నిమిషాలకు ఓ ఇద్దరు మరణిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దాదాపు 941 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. 10 రెట్లు ప్రమాదకరంగా మారిన వైరస్‌! )

కాగా, దేశంలో కొత్తగా 57,982 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 50,921కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 19లక్షల మంది బయటపడ్డారు. సోమవారం నాటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల టెస్టులు చేసినట్టు ఐసీఎమ్‌ఆర్‌ వెల్లడించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు