ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..

21 May, 2021 10:12 IST|Sakshi
ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకునే ‘కోవిసెల్ఫ్‌ టెస్ట్‌’ కిట్‌

కోవి సెల్ఫ్‌.. పరీక్షించుకోండిలా..

కిట్‌ వినియోగంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు 

వీడియో రూపంలో అందుబాటులోకి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్‌ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్‌’ టెస్ట్‌ కిట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్‌ ద్వారా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్‌’ టెస్ట్‌ కిట్‌ యూజర్‌ మ్యాన్యువల్‌లో కూడా కిట్‌ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి.

కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్‌ రోగులను కలిసిన వారు ఈ కిట్‌ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్‌గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు.

పరీక్షలు ఇలా చేసుకోవాలి..

 • ఈ కిట్‌ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి.
   
 • పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి.
   
 • కోవిసెల్ఫ్‌ కిట్‌లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్‌ స్వాబ్‌ (ముక్కులో నుంచి శాంపిల్‌ తీసుకునేందుకు), శాంపిల్‌ తీసిన తర్వాత స్వాబ్‌ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్‌ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి.
   
 • నాసల్‌ స్వాబ్‌ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్‌ను తెరిచి ఈ స్వాబ్‌ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి.
   
 • స్వాబ్‌ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్‌కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్‌ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్‌ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్‌ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్‌ కార్డు ఫోటో తీసుకోవాలి.
   
 • 15 నిమిషాల తర్వాత మొబైల్‌ యాప్‌లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్‌వ్యాలిడ్‌గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్‌ కోవిడ్‌ టెస్టింగ్‌ పోర్టల్‌లో భద్రపరుస్తారు.
   
 • పాజిటివ్‌గా తేలితే కోవిడ్‌ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి.

చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి
చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు