Corona: వేపచెట్ల కిందే చికిత్స... ప్రాణం నిలుస్తోంది!

1 Jun, 2021 09:10 IST|Sakshi

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోలో చెట్ల‌కిందే క‌రోనా ట్రీట్మెంట్‌

చెట్లే ప్రాణం పోస్తున్నాయంటున్న బాధితులు

ల‌క్నో : మారుమూల ప్రాంతాల్లోని క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డం, ఆస్ప‌త్రులు లేక, డాక్ట‌ర్లు ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతో క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఓ రిమోట్ ఏరియాకు చెందిన క‌రోనా బాధితులు ఆర్ఎంపీ డాక్ట‌ర్ల సాయంతో  చెట్ల‌కిందే ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాలతో బయ‌ట‌ప‌డుతున్నామని చెబుతున్నారు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

రాయిట‌ర్స్ క‌థ‌నం ప్ర‌కారం.. మారుమూల గ్రామాల్లో సరైన వైద్యు స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో.. ఉత్త‌ర్‌ప్రదేశ్‌లోని జేవార్ జిల్లాకు చెందిన క‌రోనా బాధితులు చెట్ల‌కిందే క‌రోనా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో  ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న బాధితులు వేప‌చెట్లు ఉన్న స్థలాన్నే క‌రోనావార్డులుగా మార్చుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆర్ఎంపీ డాక్ట‌ర్ల సాయంతో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాల్ని కాపాడుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే బాధితుల‌కు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయిన వెంటనే వేపచెట్ల కింద మంచాలపై ప‌డుకుటుంటున్నారు. దీంతో వెంట‌నే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరిగి ఉపశమనం లభిస్తోందని గ్రామ‌స్తులు చెబుతున్నారు. 

జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మాజీ ప్రెసిడెంట్  యోగేశ్ త‌ల‌న్ మాట్లాడుతూ.. "మాకు స‌రైన వైద్య స‌దుపాయాలు లేవు. క‌రోనా వ‌చ్చింద‌ని టెస్టులు చేయించుకుందామంటే ఆస్ప‌త్రులు లేవు. అందుకే మేమంతా ఆరుబ‌య‌ట చెట్ల‌కిందే క‌రోనాకు చికిత్స చేయించుకుంటున్నాం. ఎవరికైనా ఆక్సిజ‌న్ స‌మ‌స్య ఎదురైతే వేప‌చెట్ల కింద‌నే ప‌డుకుంటున్నారు. ఈ క్రమంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరిగినట్లు చాలా మంది చెబుతున్నారు’’ అని తెలిపారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి గ్రామాల్లో వైద్య‌స‌దుపాయాల ఏర్పాటుకు కృషి చేయాల‌ని కోరారు.


చ‌ద‌వండి : అయ్యో నా కూతురు చ‌నిపోయింది సార్‌, మీకు డ్రామాలా ఉందా? 

మరిన్ని వార్తలు