గత 24 గంటల్లో 20,036 కరోనా కేసులు 

1 Jan, 2021 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,036 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 256 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,02,86,710 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 1,48,994 మంది మరణించినట్లు బులెటిన్‌ విడుదల చేసింది.  భారత్‌లో కరోనా కేసులు పెరిగినా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో నమోదవుతుంది.  (బ్రిటన్‌ గుండెల్లో కోవిడ్ దడ)

గడిచిన 24 గంటల్లో 23,181 మంది డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటివరకు 98,83,461 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  2,54,254 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రలో కొత్తగా  3,509 కేసులు నమోదుకాగా, 58మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 49,521 గా ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో, 18,28,546 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా కేరళలో గత 24 గంటల్లో  5,215 కరోనా కేసులు బయటపడగా,  5,376మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. (ఫైజర్‌ వ్యాక్సిన్‌కు WHO గుర్తింపు)

>
మరిన్ని వార్తలు