కరోనా విలయం: ఒకేరోజు 780 మంది మృత్యువాత

9 Apr, 2021 10:26 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కు చేరుకుంది. ఒకే రోజు లక్షకు పైగా కేసులు నమోదవడం ఇది నాలుగోసారి.

కాగా గురువారం ఒక్కరోజే కరోనాతో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,67,642కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్‌ సంఖ్య 9,79,608కి చేరుకుంది. కొత్తగా 61,899 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 9,43,34,262 వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మరోవైపు తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదవ్వగా, గురువారం అదుగురు మృతి చెందారు. 363 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 15,472 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 9,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో 402 కరోనా కేసులు వెలుగు చూశాయి.  నిన్న 1,01,986 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

చదవండి: బెంగళూరును వదలని కరోనా.. మృత్యు ఘంటికలు
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు