భారత్‌లో కొత్తగా 26,624 కరోనా కేసులు

20 Dec, 2020 11:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి 30వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,624 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 1,00,31,223కు చేరింది.  శనివారం 341 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1,45,477 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇక నిన్న 29,690 మంది డిశ్చార్జి అవ్వగా.. మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,05,344 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.51గా ఉంది. మరణాల రేటు 1.45కు తగ్గగా.. యాక్టివ్‌ కేసుల శాతం 3.04గా ఉంది. చదవండి: లాక్‌డౌన్‌... పొట్ట బెలూన్‌

మరోవైపు తెలంగాణలో కొత్తగా 592 కేసులు వెలుగుచూడగా మొత్తం పాజిటివ్‌ కేసుల 2,81,414కు చేరింది. కేసుల సంఖ్య ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 1,513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,888 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి నిన్న 643 మంది కోలుకోగా, ఇప్టపి వరకు కోలుకున​ బాధితుల సంఖ్య 2,73,013కు చేరింది. చదవండి: టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!

మరిన్ని వార్తలు