దేశంలో మళ్లీ 40 వేలకు పైగా కరోనా కేసులు

19 Nov, 2020 10:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ  కొనసాగుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 89 లక్షల 58 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,576  పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483కు చేరగా.. మరణాల సంఖ్య 1,31,578కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,43,303 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే  44,493 మంది కోలుకోగా ఇప్పటి వరకు 83,83,602 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.58గా ఉండగా, మరణాల రేటు 1.47శాతానికి తగ్గింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4.95 శాతంగా ఉంది.

చదవండి: కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు

మరిన్ని వార్తలు