భారత్‌లో 91 లక్షలు దాటిన కరోనా కేసులు

23 Nov, 2020 10:50 IST|Sakshi

కొత్తగా 44,059 కరోనా కేసులు, 511 మరణాలు

న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,059 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం మొత్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 511 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,33,738కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. మొత్తం కేసుల సంఖ్య 91,39,866గా ఉండగా,  ప్రస్తుతం   4,43,486 యాక్టివ్‌ కేసులున్నాయి. వారిలో ఇప్పటి వరకు 85,62,641 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93.68 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.46శాతానికి తగ్గిందని బులెటిన్‌లో వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు