1.47కు తగ్గిన మరణాల రేటు

16 Nov, 2020 10:23 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 88 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 30,548 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా గత నాలుగు నెలల్లో కరోనా కేసులు 30వేలకు తగ్గడం ఇదే తొలిసారి. నిన్న ఒక్క రోజే కరోనాతో 435 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,45,127కు చేరింది. మరణాల సంఖ్య 1,30,070కు పెరిగింది. ప్రస్తుతం 4,65,478 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం 43,851 మంది కోలుకోగా ఇప్పటి వరకు 82,49,579 మంది డిశ్చార్జి అయ్యారు. చదవండి: పాస్‌లు ఉంటేనే షిర్డీ ఆలయంలోకి..

దేశంలో రికవరీ రేటు 93.27గా ఉంది. యాక్టివ్‌ కేసుల శాతం 5.26 ఉంది. మరణాల రేటు 1.47కు తగ్గింది. ఆదివారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 8,61,706 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఆదివారం నాటికి 12,56,98,252 నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు