వ్యాక్సిన్‌ పంపిణీలో ముందున్న భారత్

22 Mar, 2021 20:00 IST|Sakshi

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు విషయంలో గడువు పెంపు

 నుంచి  8 వారాలకు పెంచాలని సూచన

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీలో మనదేశం ముందున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల 50లక్షల వాక్సిన్‌లను ఉత్పత్తి చేసిన భారత్‌.. 76దేశాలకు 6కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఎగుమతి చేసినట్లు వివరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 25లక్షల మందికి పైగా వాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. 3కోట్ల 71లక్షల మందివ్యాక్సిన్‌ తొలి డోసు, 74లక్షల మంది ఈపాటికే రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగానే సీరమ్‌ కంపెనీ ..నెలకు 7 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను తయారు చేస్తోండగా, భారత్‌ బయోటెక్.. నెలకు దాదాపు 40 లక్షల కోవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తోన్నట్లు పేర్కొంది. 

ఇక కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు విషయంలో కేంద్రం గడువు పెంచింది. ప్రస్తుతం కోవిషీల్డ్‌ తొలివిడతకు, రెండోవిడతకు 4 వారాల అంతరం ఉంది. దీన్ని 8 వారాల వరకు పెంచాలని కేంద్రం సూచించింది. రెండు డోసుల మధ్య 8 వారాల అంతరం విధించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ నిబంధనలు కేవలం కోవిషీల్డ్‌కే వర్తిస్తుందని, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ విషయంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. 

చదవండి : విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 46 వేల కేసులు
ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌!

మరిన్ని వార్తలు