దేశంలో మరింత తగ్గిన కరోనా మరణాలరేటు

30 Nov, 2020 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,772 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94 లక్షల 31 వేలకు చేరుకుంది. కోవిడ్‌ మరణాల సంఖ్య లక్షా ముప్పై ఏడువేలు(1,37,139) దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 45,333 మంది కోవిడ్‌ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 88,47,600కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.81గా ఉంది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 4.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.45శాతానికి తగ్గింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.   చదవండి:  (కరోనాపై చైనా మరో కథ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు