దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు

29 Jul, 2021 10:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, గత 24 గంటల్లో 640 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3,07,01,612 మంది కరోనా బారి నుంచి క్షేమంగా కొలుకున్నారు.

ఇప్పటి వరకు 45.07 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గత 24 గంటలలో 17,28,795 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా, దేశంలో ఇప్పటి వరకు 46,26,29,773 సాంపుల్‌ను పరీక్షించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తలు