దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు

30 Jul, 2021 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరొసారి విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుతున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా, 555 మంది కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు.  దేశంలో ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది.

 ఇప్పటి వరకు దేశంలో 3.07 కోట్ల మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటలలో 42,360 మంది కొలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు 45.60 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో  వెల్లడించారు. 

మరిన్ని వార్తలు