24 గంటల్లో 59,105 మంది డిశార్జ్‌

26 Oct, 2020 10:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌  విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,09,000 దాటాయి. గడచిన 24 గంటలలో దేశంలో 45,148 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 24 గంటల్లో 480 మంది కరోనా వలన మరణించారు. అయితే ఇక్కడ ఊరటనిచ్చే విషయం ఏంటంటే కరోనా నుంచి కోలుకొని 24 గంటల్లో 59,105 మంది డిశార్జ్‌ అయ్యారు. దేశ వ్యాప్తంగా 6,53,717 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకి మొత్తం 1,19,014 మంది  మృతి చెందారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 90.23 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 8.26 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు కేవలం 1.50 శాతం. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,39,309 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా, ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 10,34,62,778. 

చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్‌

మరిన్ని వార్తలు