కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు

29 Apr, 2021 10:21 IST|Sakshi

ఒక్క రోజులోనే 3,79,257 కేసులు

వైరస్‌ బాధితుల్లో 3,645 మంది మృతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది.

బుధవారం ఒక్కరోజే వైరస్‌ బాధితుల్లో 3,645 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం మృతు సంఖ్య 2,04,832 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,50,86,878 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ కాగా, దేశంలో ప్రస్తుతం 30,84,814 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ అందించారు.

తెలంగాణలలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కరోనా కేసులు నమోదు కాగా, 58 మంది బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 4,27,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,49,692 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,630 కరోనా కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ 615, రంగారెడ్డి 558, నిజామాబాద్‌ 301, మహబూబ్‌నగర్‌ 263, ఖమ్మం 213, వరంగల్ అర్బన్‌ 162 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

చదవండి: భారత్‌కు రానున్న మరో టీకా: స్పుత్నిక్‌- వి వివరాలు!

మరిన్ని వార్తలు