సెకండ్‌ వేవ్‌: తొలిసారి 4వేలు దాటిన కరోనా మరణాలు

8 May, 2021 10:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోవిడ్‌ విజృంభనతో వరుసగా మూడో రోజు 4లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24గంటల్లో  కొత్తగా 4,01,078 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో 4,187 మంది మరణిచారు.

దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం మరణాల సంఖ్య  2,34,083కు చేరింది. కాగా దేశంలో ఇప్పటివరకు 1,79,30,960 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37,23,446 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  దేశంలో ఇప్పటివరకు 16.73 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు 
సాక్షి, హైదరాబాద్‌​: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 5,559 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,199కు చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 41 మంది మరణించాదు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 2,626కు పెరిగింది.

కరోనా గడిచిన 24 గంటల్లో 8,061 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,13,225 మంది వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్కరోజు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 71,308 యాక్టివ్ కేసులు ఉ‍న్నాయి.


చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!

మరిన్ని వార్తలు