సెకండ్‌ వేవ్‌: ఒక్కరోజే 4 లక్షల కరోనా కేసులు

1 May, 2021 11:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గం‍టల్లో 4,01,993 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969కు పెరిగింది.

అదే విధంగా గడిచిన 24 గంటల్లో 3,523 మంది కోవిడ్‌తో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 2,11,853కు చేరింది.  శుక్రవారం 2,99,988 మంది కరోనా బాధితులు కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యా రు. ఇప్పటి వరకు 1,56,84,406 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,68,710కి చేరింది. దేశంలో కోవిడ్‌-19 రికవరీ రేటు 81.84గా ఉంది.

తెలంగాణలో కొత్తంగా 7,754 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. శుక్రవారం నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 51 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది.

శనివారం 6,542 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 3,62,160 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,507 నమోదయ్యాయి.


చదవండి: Corona: రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతున్నాయా? ఈ టెక్నిక్‌ ఫాలో అవండి

మరిన్ని వార్తలు