భారత్‌లో కరోనా విలయం.. 17.50 లక్షలు దాటిన కేసులు

2 Aug, 2020 10:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసులు సంఖ్య 17.5 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో మ‌రోసారి రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. శనివారం ఒక్క  రోజే అత్యధికంగా 54,736కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 17,50,724కి చేరింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.
(చదవండి : తెలంగాణలో కొత్తగా 1891 కరోనా కేసులు)

కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 853 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య  37,364 కు చేరింది. ఇక గత 24 గంటల్లో 51,255 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 11,45,629 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాపంగా రికవరీ రేటు 65.44శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,98,21,831 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో ప్రస్తుతం 5,67,730  యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
(చదవండి: విషాదం.. కరోనా బాధితులు ఆత్మహత్య)

మరిన్ని వార్తలు