దేశంలో 55 లక్షలు దాటిన కరోనా కేసులు

22 Sep, 2020 10:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో 75,083 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,053 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు మంగళవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 55,62,664గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,75,861గా ఉండగా.. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,97,868కి చేరింది. కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 88,935కు చేరింది.

గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 1,01,468 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 80.12 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 18.28 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసుల్లో మరణాల రేటు 1.60 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో 9,33,185 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 6,53,25,779గా ఉంది.

మరిన్ని వార్తలు