కరోనా: కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసులు 

4 May, 2021 08:51 IST|Sakshi

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి 

న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో ఊహించిన దాని కన్నా చాలా ముందే కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల నిలిచిపోయిందని, రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలిపింది. తెలంగాణ, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్‌ సహా 13 రాష్ట్రాల్లో రోజువారీగా వస్తున్న కొత్త కేసుల్లో స్థిరీకరణ కనిపిస్తోం దని సోమవారం ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

కానీ, బిహార్, రాజస్తాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ల్లో మాత్రం ఆందోళనకర స్థాయిలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఢిల్లీలో ఏప్రిల్‌ 24న కొత్తగా 25,294 కేసులు నమోదవగా, మే 2న 24,253 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు. చత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్‌ 29న కొత్తగా 15,583 కేసులు నమోదు కాగా, మే 2వ తేదీన 14,087 కేసులు నమోదయ్యాయన్నారు.

ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో కేసులు నమోదవు తున్నాయన్నారు. తెలంగాణలోని నిర్మల్‌ సహా ఈ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. అయితే, ఈ గణాంకాల ఆధారంగా ముందే ఒక నిర్ణయానికి రాలేమన్నారు. రాష్ట్రాలవారీగా క్షేత్రస్థాయిలో కేసుల నియంత్రణ కు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, పశ్చిమబెంగా ల్, కర్నాటక, కేరళ తదితర 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయన్నారు. 7 రాష్ట్రాల్లో యాభై వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్‌ కేసులున్నా యని తెలిపారు. అస్సాం, బిహార్, హరియాణా, కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్తాన్, పశ్చి మ బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందన్నారు.

చదవండి: కరోనా టెస్టు చేయలేదని తలుపు విరగ్గొట్టాడు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు