కరోనా అప్‌డేట్స్‌: అంతకంతకు పెరిగిపోతున్న కేసులు.. వైరస్‌ గుప్పిట ముంబై!

10 Jun, 2022 20:34 IST|Sakshi

ముంబై/ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ నాలుగో వేవ్‌పై అధికారిక ప్రకటన లేకపోయినా.. దేశంలో కరోనా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 3 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో ఢిల్లీలోనూ 655 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మహారాష్ట్రలో తాజాగా 3,081 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరణాలు నమోదు కాకపోవడం ఊరట ఇచ్చే అంశం. అలాగే యాక్టివ్‌ కేసుల సంఖ్య 13, 329కి చేరింది. అదే సమయంలో ముంబైలోనూ కరోనా విజృంభిస్తోంది.  తాజాగా రెండు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. బులిటెన్‌లో 1,956 కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర యాక్టివ్‌ కేసుల సంఖ్యలో ముంబైలనే 9వేల దాకా ఉండడం గమనార్హం. 


ఇంకోవైపు ఢిల్లీలోనూ కేసులు కొనసాగుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 655 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు మరణాలు నమోదు అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ తాజా బులిటెన్‌లో 155 కేసుల దాకా నమోదు అయ్యాయి.  తాజా గణాంకాలతో.. శనివారం కేంద్రం విడుదల చేసే బులిటెన్‌లో కేసులు అత్యధికంగా నమోదు కానున్నాయి.

చదవండి: కరోనా కథ అయిపోలేదు.. డిసెంబర్‌ వరకు ఇలాగే..: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

మరిన్ని వార్తలు