సెకండ్‌ వేవ్‌: ఆగని మృత్యుఘోష..కొత్తగా 2,67,334 పాజిటివ్‌ కేసులు

19 May, 2021 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతుంది. వరసగా ఆరో రోజు 3లక్షలకు తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో మొత్త కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 4529 మంది కరోనా బాధితులు మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా వల్ల దేశంలో 2,93,248 మృతి చెందారు. దేశంలో మరణాల రేటు 1.10 శాతంగా వుంది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,89,851మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.60శాతంగా వుంది.  ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 32,03,01,177 క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
(చదవండి:ఇప్పటివరకు యూపీలో ముగ్గురు మంత్రులు)

మరిన్ని వార్తలు