కరోనా కేసులు పైపైకి.. అక్కడ మళ్లీ మాస్క్‌ సంకేతాలు!

3 Jun, 2022 11:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మరోసారి పెరుగు ముఖం పట్టాయి. తాజాగా శుక్రవారం బులిటెన్‌లో 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్నటి కేసులతో పోలిస్తే ఇవాళ అదనంగా మరో పదిహేను వందలకు పైగా కొత్త కేసులు రావడం గమనార్హం.

దేశంలో తాజాగా 4,041 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్‌తో పది మంది మృతి చెందారు. అలాగే యాక్టివ్‌ కేసులు కూడా 20 వేల మార్క్‌ను దాటేసి.. 21, 177కి చేరాయి.  డెయిలీ పాజిటివిటీ రేటు.. 0.60 శాతంగా, వీక్లీ రేటు 0.56 శాతంగా నమోదు అయ్యింది.

ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత మూడు వేల మార్క్‌ దాటింది కరోనా. ఇక గురువారం యాక్టివ్‌ కేసుల సంఖ్య 19, 509 ఉండగా.. శుక్రవారం ఆ సంఖ్య 21, 177కి చేరింది. 

ఇలాగే ఉంటే మాస్క్‌ తప్పదు!
దేశంలో కరోనా కేసుల పెరుగుదల మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మాస్క్‌ నిబంధనను మళ్లీ తెస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుతున్నాయి. దేశంలో చాలా చోట్ల కరోనా నిబంధనలకు కాలం చెల్లింది. అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటి గురించి ఆలోచించాలంటూ కేంద్రం, పలు రాష్ట్రాలను అప్రమ్తతం చేస్తోంది.

మరిన్ని వార్తలు