India Covid-19: కాస్త తగ్గిన రోజువారీ కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే

18 Jan, 2022 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల్లో రోజువారీ కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన రేపుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు అనిపిస్తోంది. అయితే గత రోజుతో పోలిస్తే దేశంలో తాజాగా రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,38,018 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త కేసులు 20 వేలకు పైగా తగ్గడం సానుకూలాంశం అయినప్పటికీ 2లక్షలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 19.65 శాతం నుంచి 14.43 శాతానికి తగ్గడం కొంత ఊరటనిస్తోంది. 
చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్‌!

9వేలకు చేరువలో ఒమిక్రాన్‌ కేసులు
సోమవారం రోజు వైరస్‌ కారణంగా మరో 310 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,57,421 మంది కోలుకోగా రికవరీ రేటు 94.09శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 9వేలకు చేరువైంది. ప్రస్తుతం 8,891 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు భారత్‌లో 158కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.
చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?

మరిన్ని వార్తలు