ఢిల్లీలో కరోనా కేసులు తగ్గాయి అయితే..

11 Aug, 2020 12:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. రోజురోజుకు నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులకంటే.. రికవరీల సంఖ్య పెరుగుతోంది.  జూన్‌ 23 నాటి వరకు ఒక్కరోజులోనే 3 వేలకు పైగా కేసులు వెలుగులోకి రాగా.. రెండు నెలల్లో ఆ సంఖ్య వెయ్యికి పడిపోయింది. ఇక సోమవారం కొత్తగా 707 మందికి కరోనా సోకగా.. 20మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,46,134కు చేరగా, మరణాలు 4,131కు పెరిగింది. కాగా, కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆస్పత్రికి వచ్చే కోవిడ్‌ బాధితుల సంఖ్య క్రమక్రమంగాపెరుగుతోంది. రెండు వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందే వారి సంఖ్య రెండు వేల కంటే తక్కువగా ఉండగా.. గురువారం నుంచి అది 3000 పైగా పెరిగింది.
 (చదవండి : దేశంలో మరో 53,601 కరోనా కేసులు)

జూలై 29 మినహా మిగత రెండు వారాల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3000 కంటే తక్కువగానే ఉంది. మిగిలిన వారంతా హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం నాటికి 3,115 మంది కోవిడ్‌ రోగులు ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న యాక్టీవ్‌ కేసుల్లో ఇది 30 శాతంగా ఉందని డిల్లీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ తెలియజేస్తుంది. మిగిలిన బాధితలు కోవిడ్‌ సెంటర్‌లో లేదా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రజల్లో అవగాహన రావడంతో ఆస్పత్రులకు తరలి వస్తున్నారని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చికిత్స కోసం ఢిల్లీకి తరలిరావడంతో ఆస్పత్రులలో చేరే రోగుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
(చదవండి : కరోనా సంక్షోభం : కేంద్రానికి మాజీ ప్రధాని సలహాలు)

‘ప్రజలు ఆస్పత్రులకు తరలి రావడం మంచి పరిణామం, ముందు జాగ్రత్తగా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. దీని వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. గత 10 రోజులుగా ఇతర రాష్ట్రాల కరోనా రోగులు ఢిల్లీకి తరలి రావడం ఎక్కువైంది. అందుకే నగరంలోని ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఆస్పత్రులో చేరేవారే సంఖ్య మరింత పెరుగుతుంది’అని ఢిల్లీ ఏయిమ్స్‌ సూపరింటెండెంట్ డాక్టర్ డికె శర్మ పేర్కొన్నారు. 
(చదవండి : అమెరికా తర్వాత భారతే : ట్రంప్‌)

మరిన్ని వార్తలు