Coronavirus: ముంబైలో కరోనా తగ్గుముఖం

16 May, 2021 00:39 IST|Sakshi

కొద్దిరోజులుగా 2 వేల లోపే కొత్త కేసులు 

ముంబై : ముంబై మహా నగరంలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ముంబైలో 1,450 కేసులు మాత్రమే నమోదయ్యాయి. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో గత కొన్ని రోజులుగా 2 వేల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. దీంతో ముంబైకర్లతోపాటు అధికారులకు కొంత ఊరట లభించింది.

ముంబైలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అత్యంత ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఇందుకు ప్రజలు కూడా సహకరించడంతోనే నేడు పరిస్థితి మారిందని బీఎంసీ చెబుతోంది. ఏప్రిల్‌ 4 న ముంబైలో కరోనా బాధితుల సంఖ్యను పరిశీలించిస్తే 11 వేలు దాటింది. కానీ, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల, కఠినతరమైన ఆంక్షలతో కూడిన లాక్‌డైన్‌ వల్ల రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.  ముంబైలో ఇంతవరకు 6,31,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరి రేటు 92 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం నగరంలో 37, 656 యాక్టీవ్‌ కేసులున్నాయి. 

మరిన్ని వార్తలు