కరోనా: 24 గంటల్లో కొత్తగా 3,46,786 కేసులు

24 Apr, 2021 10:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ రికార్డ్‌ స్థాయిలో పెరుగుతోంది. భారత్‌లో సెంకడ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. వరుసగా మూడోరోజూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ కరోనా మరణాల సంఖ్య 2 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,624 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 25,52,940 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో 2,19,838 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,66,10,481 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 1,38,67,997 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 1,89,544 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 13,83,79,832 మందికి వ్యాక్సినేషన్‌ అందించారు.

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భారీగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,432 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 33మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,87,106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 3,26,997 మంది వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు 1961 మంది కరోనా వైరస్‌తో మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1464 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 606, రంగారెడ్డిలో 504 కరోనా కేసులు, నిజామాబాద్‌లో 486, ఖమ్మంలో 325 కరోనా కేసులు, వరంగల్ అర్బన్‌లో 323, మహబూబ్‌నగర్‌లో 280 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

మరిన్ని వార్తలు