కరోనా భారత్‌: 30 లక్షలు దాటిన కేసులు

23 Aug, 2020 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్‌ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69,239 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది.  కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరింది. తాజాగా 912 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు విడువడంతో ఆ సంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 కు చేరింది. ప్రస్తుతం 7,07,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.69 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.87 శాతంగా ఉందని వెల్లడించింది. (చదవండి: డిసెంబరు నాటికి భారత్‌లో వ్యాక్సిన్‌!)

>
మరిన్ని వార్తలు