కరోనా అలర్ట్‌.. మళ్లీ పెరుగుతున్న కేసులు! యాక్టివ్‌ కేసులు కూడా..

2 Jun, 2022 11:42 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. ఒక్క రోజులో ఏకంగా వెయ్యి కొత్త కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో 3, 172 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేసుల పెరుగుదలపై కీలక ప్రకటన చేసింది. కొత్త కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1, 081 కేసులు నమోదు అయ్యాయి. 

ఇదిలా ఉంటే బుధవారం.. 2, 745 కేసులు నమోదు అయ్యాయి. నాలుగున్నర లక్షల శాంపిల్స్‌కుగానూ.. గురువారం ఏకంగా 3, 172 కేసులు వెలుగు చూశాయి. దాదాపు 22 రోజుల తర్వాత కేసులు 3వేల మార్క్‌ దాటినట్లు కేంద్రం వెల్లడించింది. 

ఇక డెయిలీ పాజిటివిటీ రేటు 0.05శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.67గా ఉంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 19, 509గా ఉంది. ఇది కూడా ఆందోళనకు గురి చేసే అంశమని కేంద్రం పేర్కొంది. గత ఇరవై నాలుగు గంటల్లో 2, 584 మంది కోలుకున్నారు. భారత్‌లో కరోనా రికవరీ రేటు ఇప్పటిదాకా 98.74 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రభావంతో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని పేర్కొంది కేంద్రం.

మంత్రి వివాదాస్పద ‍వ్యాఖ్యలు
త‌మిళ‌నాడులో ఉత్త‌ర భార‌త్‌కు చెందిన విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాపింప‌జేస్తున్నారంటూ త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆ రాష్ట్రంలోనూ వంద దాకా కొత్త కేసులు వెలుగు చూశాయి.

చదవండి: కోవిడ్‌ సోకితే అవయవాలు దెబ్బతినడమే కాదు ఎముకలు సైతం!

మరిన్ని వార్తలు