మహారాష్ట్ర: పెరిగిపోతున్న కరోనా కేసులు.. ముంబైలో ఒక్కరోజులో 1,765 కేసులు

8 Jun, 2022 19:43 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రం అక్కడి వైద్యశాఖ విడుదల చేసిన బులిటెట్‌ ప్రకారం.. గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 2,701 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబైలోనే 1,765 కేసులు వెలుగు చూడడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. ఐదు నెలల తర్వాత ఇదే హయ్యెస్ట్‌ కేసులు.  ఒక్కరోజులోనే ముంబైలో కేసుల పెరుగుదల 42 శాతం నమోదు అయ్యింది. ముంబైలో మంగళవారం బులిటెన్‌లో 1,242 కేసులు రికార్డు అయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీ తర్వాత వెయ్యికి పైగా కేసులు వరుసగా రెండు రోజుల పాటు నమోదు అయ్యాయి. 

ఇక ముంబై తర్వాత థానేలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. పుణేతో పాటు రాయ్‌గడ్‌, పాయిగఢ్‌లోనూ కేసులు అధికంగానే నమోదు అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 1,327 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా మరణాలు శూన్యం. ప్రస్తుతం 9,806 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు