కేంద్రం జోక్యం.. భారీగా తగ్గిన రెమిడెసివిర్‌ ధరలు

18 Apr, 2021 11:37 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జోక్యంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ధరలను ఫార్మా కంపెనీలు స్వచ్ఛందంగా తగ్గించాయని నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) శనివారం తెలిపింది. దేశంలో కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర ఔషధమైన రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. అలాగే ఈ ఔషధం ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలను కోరింది.
కోవిడ్‌–19 చికిత్సలో సీరియస్‌ పెషెంట్లకు ఈ యాంటివైరల్‌ డ్రగ్‌ ఉపయుక్తకరమనే విషయం తెలిసిందే. ‘ప్రభుత్వ జోక్యం రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ (100 ఎంజీ వయల్‌) ధరలు దిగివచ్చాయి. కరోనాపై పోరులో ప్రభుత్వంతో చేతులు కలిపినందుకు ఫార్మా కంపెనీలకు ధన్యవాదాలు’అని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. 
చదవండి: ఢిల్లీలో చాలా సీరియస్‌: కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు