Gurugram Dogs Marriage: కుక్కలకు ఘనంగా వివాహ తంతు

14 Nov, 2022 12:52 IST|Sakshi

ఒక జంట పెంపుడు కుక్కలకు ఘనంగా హిందూ సంప్రదాయపద్ధతిలో వివాహ తంతు జరపనున్నారు. ఈ వింత ఘటన గురుగ్రామ్‌లోని హర్యానాలో జరగనుంది. అచ్చం హిందూ సంప్రదాయరీతిలో నాలుగు రోజులు వివాహ వేడుకను జరిపేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆ కుక్కలకు హల్దీ వేడుకను కూడా నిర్వహించారు. ఆడ కుక్క పేరు స్వీటీ కాగా మగ కుక్క పేరు షేరు.

నవంబర్‌ 14న ఆ కుక్కలకు అట్టహాసంగా పెళ్లి చేయనున్నారు. సుమారు 100 మంది దాక ఈ వివాహ తంతుకు ఆహ్వనించినట్లు కుక్కల యజమాని చెబుతున్నారు. ఈ వివాహ వేడుక హర్యానాలోని పాలం విహార్‌ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న జిల్‌ సింగ్‌ కాలనీ స్థానికులను చాలా ఆశ్చర్యపర్చింది. కానీ ఈ వివాహ వేడుకకు పెద్ద ఎత్తున​ అతిధులు మాత్రం హాజరవునున్నారు.

ఈ మేరకు కుక్కల యజమాని శ్వేత మాట్లాడుతూ...తమకు పిల్లలు లేకపోవడంతో స్వీటీని తమ బిడ్డగా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఒక రోజు తన భర్త గుడికి వెళ్లి అక్కడ కుక్కలకు ఆహారం పెట్టి వచ్చేస్తుండగా స్వీటీ అనే వీధి కుక్క తన భర్త వెంట వచ్చిందని, అప్పటి నుంచి ఆ కుక్కని తమ బిడ్డగా పెంచుకుంటున్నట్లు తెలిపారు.

ఈ విషయం పోలీసులకు తెలిస్తే మీ దంపతులను అరెస్టు చేస్తారంటూ పలువురు చెప్పారని కానీ అందుకు తాము భయపడమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మగ కుక్క షేరు యజమాని మాట్లాడుతూ ...కుక్కల పెళ్లి తంతు అనేది కామెడీగా అనిపించనప్పటికీ వివాహ పనులు మాత్రం అత్యంత సీరియస్‌గా జరుగుతున్నాయని అన్నారు. 

(చదవండి: అరే! ఏం మనషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి...)

మరిన్ని వార్తలు