వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా

27 May, 2021 22:16 IST|Sakshi

కొచ్చి: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్​డౌన్​ విధించడంతోపాటు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు పెళ్లిళ్లపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం కొంతమంది బంధువుల సమక్షంలోనే వివాహలు జరుపుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. అయితే, కొన్ని జంటలు మాత్రం నిబంధనల కారణంగా వెరైటిగా వివాహలు జరుపుకొని వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇదే తరహాలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలను వేరుచేసే చిన్నార్​ నదికి అడ్డంగా ఉన్న వంతెనపై అనేక మంది వివాహలు జరుపుకుంటున్నారు.

‘ భలే ఉంది మీ ఐడియా.. కొవిడ్​ టెస్టు డబ్బులు మిగిల్చారు’
ఇప్పటికే ఆ వంతెన మీద చాల వివాహలు జరిగాయి. ఈ క్రమంలో కేరళలోని మరయూర్​ ఇడుక్కి స్థానికుడు ఉన్నికృష్ణన్​, తమిళనాడులోని బట్లగుండుకు చెందిన వధువు తంగమాయిల్​ను ఇదే చిన్నార్​ వంతెన మీద వాళ్లు వివాహం చేసుకున్నారు. కాగా.. వివాహనికి హాజరైన వారందరికి కోవిడ్​ నెగెటివ్​ సర్టిఫికెట్​ను తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. అదే విధంగా, తమిళనాడులోని వధువు కుటుంబం వైపు వారు ఈ పరీక్షల కోసం ఒక్కొరు రూ. 2,600 చెల్లించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి పదిమంది టెస్ట్​ చేయించుకోవటానికి రూ.26,000 అవుతుంది.


కాబట్టి, వీటినుంచి తప్పించుకోవాటానికి ఈ వంతెన మీద వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. కనీసం వివాహం జరిపించడానికి పురోహితుడు కూడా లేడు. అయితే మొత్తానికి వధువు, వరుడు వంతెనపై నిలబడి ఎలాంటి ఆటకం లేకుండా ఒక్కటయ్యారు. వంతెనకు ఇరువైపులా నిలబడి బంధువులను నూతన దంపుతులను ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ వెరైటీ పెళ్లి సోషల్​మీడియాలో వైరల్​ అయ్యింది. కాగా, దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే ఉంది మీ ఐడియా.. కోవిడ్​ టెస్టు డబ్బులు మిగిల్చారు.. పురోహితుడుంటే బాగుండు అంటూ’ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, తమిళనాడు, మధురైకి చెందిన ఒక జంట .. బెంగళురు నుంచి మధురై వెళ్లె ప్రత్యేక విమానం బుక్​ చేసుకోని మరీ తమ బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి:  ‘క్యూబూల్‌ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు