భళా సంజన.. చిరుతని చితక్కొట్టి భర్తని కాపాడుకున్నావ్‌!

31 Mar, 2022 12:38 IST|Sakshi

పుణె: కొంతమంది పిల్లులను చూసి కూడా భయపడుతుంటారు. అలాంటిది చిరుతపులంటే దడుచుకుని కిలో మిటరు దూరం ఆగకుండా పరిగెత్తారు. అదే పులితో పోరాడాల్సి వస్తే ఆ మాటలను ఊహించాలంటే భయమేస్తుంది. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని బారి నుంచి తన భర్తను కాపాడుకుంది. ఈ ఘటన మార్చి 25 రాత్రి అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ తహసీల్‌లోని దరోడి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులందరు గాఢనిద్రలో ఉండగా, సంజన తమ ఇంటి బయట చిరుతపులి ఉండటాన్ని పసిగట్టింది. ఈ విషయాన్ని తన భర్త గోరఖ్ దశరథ్ పవాడేకు చెప్పగా అతడు బయటకు వెళ్లాడు. అంతలో చిరుతపులి ఆ వ్యక్తిపైకి దూకి దాడి చేసింది. అది ఆ వ్యక్తి వీపును పట్టుకుని గాయపరుస్తుండగా ధైర్యాన్ని కూడగట్టుకుని అతని భార్య సంజన పరుగెత్తుకుంటూ వచ్చి పులితో పోరాడుతూ దాని తోకను పట్టుకుని వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది.

ఆమె చిరుతపులి బారి నుంచి తన భర్తను విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగానే సంజన తండ్రి, ఆ ఇంట్లోని పెంపుడు కుక్క కూడా అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా పెంపుడు కుక్కతో దశరథ్‌ తండ్రి అక్కడికి వచ్చి కట్టెలు, గ్రానైట్‌ రాళ్లతో చిరుతను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడిపై చిరుత పట్టుకోల్పోయింది. వెంటనే మహిళ భర్త పులి నుంచి దూరంగా జరిగాడు. చివరకు వారంతా కలిసి చిరుత అక్కడి నుంచి తరిమికొట్టారు.

చదవండి: ‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి నిలువుదోపిడి చేసిన మహిళ

>
మరిన్ని వార్తలు