ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాల్ని కుక్కేశారు

28 Apr, 2021 11:35 IST|Sakshi
ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాలు(ఫొటో: ఇండియా టుడే)

ఔరంగాబాద్‌: లెక్కకు మించి కోవిడ్‌తో పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంతో వారి తరలింపు సైతం సమస్యగా మారింది. దీంతో 22 మంది కోవిడ్‌ బాధితుల మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో కుక్కి తరలించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్‌ జిల్లాలోని అంబజోగాయ్‌లో స్వామి రామానంద్‌ తీర్థ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాల మార్చురీలో భద్రపరిచిన కోవిడ్‌ బాధితుల మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించాల్సి ఉంది.

దీంతో ఆదివారం 22 మృతదేహాలను ఒకేసారి ఒక్క అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనపై వైద్య కళాశాల డీన్‌ శివాజీ వివరణ ఇచ్చారు. ‘ఒకప్పడు మా వద్ద ఐదు అంబులెన్స్‌లు ఉండేవి. ఇప్పుడు రెండు ఉన్నాయి. దీంతో ఒక దాంట్లో 22 మృతదేహాలను, మరో దాంట్లో ఎనిమిది మృతదేహాలను ఇలా తరలించాల్సి దుస్థితి తలెత్తింది’ అని చెప్పారు.

చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి  

మరిన్ని వార్తలు