23 లక్షలు దాటిన కరోనా కేసులు

14 Aug, 2020 05:26 IST|Sakshi

24 గంటల్లో 66 వేల కేసులు

పెరిగిన రికవరీ, తగ్గిన మరణాల రేటు

న్యూఢిల్లీ: భారత్‌లో గురువారం కొత్తగా 66,999 కేసులు బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,637కు చేరుకుంది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 56,383 కోలుకోగా, 942 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 47,033కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,53,622గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27.27 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 70.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.96 శాతానికి పడిపోయిం దని తెలిపింది.

మొత్తం మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. ఆగస్టు 12 వరకు 2,68,45,688 శాంపిళ్లను పరీక్షించి నట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రతి మిలియన్‌ మందికి 19,453 పరీక్షలు జరుగుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు