Covid 19: వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌పై మాట మార్చిన కేంద్రం.. తెరపైకి కొత్త కంపెనీ!

11 Aug, 2022 20:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ కోవిడ్‌ టీకాలు తీసుకున్న వ్యక్తులు బూస్టర్‌ డోసుగా బయోలాజికల్‌–ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోర్బావ్యాక్స్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకున్నామో బూస్టర్‌ డోసుగా అదే కంపెనీ వ్యాక్సిన్‌ బూస్టర్‌ వేసుకోవాలని చెబుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చింది. 

కోవిడ్‌–19పై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వయిజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) సిఫార్స్‌ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ అనుమతులు మంజూరు చేసింది. కోవిషీల్డ్‌ లేదంటే కోవాగ్జిన్‌ తీసుకున్న ఆరు నెలలు లేదంటే 26 వారాల తర్వాత కోర్బావ్యాక్స్‌ను 18 ఏళ్లకు పైబడిన వారు బూస్టర్‌ డోసుగా వేసుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

చదవండి: ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు