మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్‌

19 Apr, 2021 19:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ సెకండ్‌ వేవ్‌ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఫేజ్‌-3 వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం పేర్కొంది. కాగా కోవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది.

అయితే మొదటి ఫేజ్‌లో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. ప్రస్తుతం 45 ఏళ్లు వారందికి ఇస్తున్నారు. కానీ తాజాగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు