Corona Deaths: బెంగళూరులో శ్మశానాలన్నీ ఫుల్

16 Apr, 2021 14:16 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

రుద్రభూముల్లో మృతదేహాల క్యూలు 

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్‌ సోకి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. శ్మశానాల వద్ద మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. బెంగళూరులో కోవిడ్‌ సోకి నిత్యం 50 మంది వరకూ మరణిస్తున్నారు. నగరంలోని 5 శ్మశానాల్లో కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. శ్మశాన వాటిక వద్ద ఒక్కో అంబులెన్సు అంత్యక్రియల కోసం నాలుగైదు గంటలు క్యూలలో వేచి చూడాల్సి వస్తోంది.
 
ఐదే ఐదు శ్మశాన వాటికలు 
బెంగళూరు జాలహళ్లి వద్ద ఉన్న సుమనహళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు శ్మశానవాటికల్లో కోవిడ్‌ సోకి మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వృద్ధులే అధికం..
ఈ ఏడాది ఏప్రిల్‌లో 280 మంది బెంగళూరు వాసులు కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 13,14 తేదీల్లో కరోనా సోకి 55 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది జనవరిలో 66మంది, ఫిబ్రవరిలో 88, మార్చిలో 147, ఏప్రిల్‌లో 280 మంది మరణించారు. ఇందులో 210 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. 

ఇక్కడ చదవండి:
బెంగళూరులో వైరస్‌ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు

అదుపులేని కోవిడ్‌ భూతం: మరి రాత్రి కర్ఫ్యూ ఎందుకు?

>
మరిన్ని వార్తలు