బెంగళూరు: పీజీలపై కరోనా పిడుగు... ఎటుచూసినా ఖాళీ

17 Jun, 2021 14:24 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చేవారికి బెంగళూరులోని పేయింగ్‌ గెస్ట్‌ (పీజీ) హాస్టళ్లు ఆశ్రయమిస్తూ ఉండేవి. నగరంలో పలు ముఖ్య ప్రాంతాల్లో హాస్టళ్ల నిర్వహణ ఎంతోమందికి ఉపాధినిచ్చేది. అయితే కరోనా రెండో దాడి మరోసారి పీజీలను సంక్షోభంలోకి పడేసింది. లాక్‌డౌన్‌ వల్ల, అలాగే ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రం హోం ఫలితంగా వేలాది మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఫలితంగా చాలా పీజీలు ఖాళీ అయ్యాయి. నగరంలో సుమారు 8 వేల పీజీలు మూత పడినట్లు అంచనా. దీనివల్ల సుమారు 40 వేల మంది ఉపాధి కోల్పోయినట్లు తెలుస్తోంది.  

తేరుకునేలోగా మళ్లీ దాడి..  
తొలిసారి కరోనా వచ్చిన 2020 మార్చి నుంచి ప్రతి రోజు పీజీలు మూత పడుతూనే ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరో 4 వేల పీజీలు మాత్రం అరకొరగా నడుస్తున్నట్లు చెప్పారు. పీజీలు ఖాళీ కావడంతో భవనాల అద్దె, కరెంటు బిల్లులు, బ్యాంకు అప్పుల కంతుల చెల్లించడం కూడా కష్టంగా ఉన్నట్లు సీహెచ్‌ తిరుపతిరెడ్డి అనే పీజీ యజమాని వాపోయారు.  తాజా అన్‌లాక్‌తోనైనా మళ్లీ పాతరోజులు వస్తాయేమోనని ఆశ చిగురించింది.   

చదవండి: Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు

మరిన్ని వార్తలు