కరోనాతో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

12 Apr, 2021 11:49 IST|Sakshi

కేంద్ర మంత్రి సంజీవ్​ బాల్యన్‌కు కరోనా 

సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి  రికార్డు స్థాయి కేసులతో బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ మరింతఆందోళన సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49)  కరోనాతో కన్నుమూశారు. ముంబైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని  పార్టీ వర్గాలు ప్రకటించాయి. ధనారే ఇటీవల కోవిడ్-19 బారిన పడటంతో గుజరాత్, వాపిలోని ఆసుపత్రిలో చేరారని, అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేపోవడంతో సోమవారం తెల్లవారుజామున ధనారే మరణించారని తెలిపాయి. పాల్ఘర్ జిల్లా, దహనుకు చెందిన ఆయన 2014 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.  ధనారేకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  (కరోనా విలయం: రెండో స్థానంలోకి భారత్‌)

రెండో దశలో కరోనా వ్యాప్తి కొనసాగగుతున్న సమయంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు,  ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ ​బాల్యన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో  ఉన్నానన్నారు. అలాగే ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు  చేయించుకుని, జాగ్రత్తలు పాటించాలని బాల్యన్ కోరారు. (ఇల్లు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!)

మరిన్ని వార్తలు