వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ!

9 May, 2021 16:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో గత ఏడాదితో ఈ ఏడాది కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కరోనా మహమ్మారి వల్ల ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క చాలా మంది కరోనా భాదితులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా మంది కరోనా పేషెంట్స్ తమ ఇళ్లలో స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. అయితే, తమ కుటుంబ సభ్యులకు ఎవరికైన వ్యాది సోకుతుందోమోననే భయంతో వారికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు, వారే సొంతంగా ఆహారం వండుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఇలా ఇబ్బందులు పడుతున్న కోవిడ్-19 రోగులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ప్రముఖ సెలెబ్రిటీ చెఫ్ సరన్ష్ గోయిలా. ఇతను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో సరన్ష్ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కరోనా రోగులు వాట్సాప్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు సరన్ష్. కోవిడ్ -19 భాదితులు వాట్సాప్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు సరన్ష్. కోవిడ్ -19 రోగులకు వాట్సాప్ ద్వారా తమ దగ్గరలోని ప్రాంతల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి covidmealsforindia.com అనే ఒక పోర్టల్ రూపొందించారు.ఈ ప్లాట్‌ఫామ్‌కు చాలా అద్భుతమైన కూడా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 2 లక్షల మంది వినియోగదారులుదీని ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సేవలు మెట్రో సిటీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్‌లో ఎలా బుక్ చేసుకోవాలి: 
1. మొదట మీ వాట్సాప్‌ నుంచి +91 8882891316 'హాయ్' పంపండి లేదా https://wa.me/918882891316పై క్లిక్ చేసి హాయి అనే మెసేజ్ పంపండి.
2. ఇప్పుడు మీకు రెండు ఎంపికలు వస్తాయి. బోజనం కోసం ఆర్డర్ చేసుకోవడానికి 2 టైపు చేసి పంపండి.
3. అప్పుడు వాట్సాప్ బోట్ మీ ప్రాంతం పిన్‌కోడ్ అడుగుతుంది. 
4. మీ పిన్‌కోడ్‌ను పంపిన తర్వాత, మీ ప్రాంతంలో పంపిణీ చేసే అన్ని సర్వీసు ప్రొవైడర్ల జాబితాను మీకు ప్రత్యక్షమవుతుంది.
5. మీకు నచ్చిన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి. వెంటనే వారి అధికారిక వెబ్‌సైట్‌లోకి ప్రవేశం పొందుతారు. 
6. వెబ్‌సైట్‌లో మీ సర్వీస్ ప్రొవైడర్ కాంటాక్ట్ డీటెయిల్స్ పొందవచ్చు. ఫుడ్ మెను, ఇతర ఆహారాల లభ్యత కోసం మీరు స్వయంగా సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఫుడ్ ఆర్డర్ చేసిన కొద్ది సేపటికే ఆరోగ్యకరమైన ఆహారం మీ ఇంటిముందు ఉంటుంది. మీరు బుక్ చేసుకున్న ఫుడ్ కి నగదు చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి:

కరోనా ఎఫెక్ట్: అమెజాన్ కస్టమర్లకు షాక్!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు