బెంగళూరులో ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు

3 May, 2021 08:28 IST|Sakshi

మరో 37,773 కేసులు

సాక్షి, బెంగళూరు: కన్నడనాట పతాకస్థాయికి ఎగబాకిన కరోనా రక్కసి అదేచోట కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,733 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. 21,149 మంది కోలుకున్నారు. ఇంకో 217 మంది కరోనాతో పోరాడి ఓడిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 16,01,865కు పెరిగింది. అందులో 11,64,398 మంది కోలుకున్నారు. మరో 16,011 మంది కన్నుమూశారు. ప్రస్తుతం 4,21,436 మంది చికిత్స పొందుతున్నారు.  

బెంగళూరులో 21,199  
ఐటీ సిటీలో తాజాగా 21,199 పాజిటివ్‌లు, 10,361 డిశ్చార్జిలు, 64 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 7,97,292 మందికి కరోనా సోకగా 5,08,923 మంది కోలుకున్నారు. 6,601 మంది చనిపోయారు. 2,81,767 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా మరణాల వివరాలు  
బెంగళూరులో 64, బళ్లారిలో 18, చామరాజనగరలో 15, తుమకూరులో 13, శివమొగ్గలో 12, హాసనలో 11, మైసూరులో 8, రామనగరలో 8, కలబురిగిలో 7, ఉత్తరకన్నడలో 7, బీదర్‌లో 6, బెంగళూరు రూరల్‌లో 5, కోలారులో 5, కొప్పళలో 5, మండ్యలో 5 చొప్పున కన్నుమూశారు.  

23,539 మందికి టీకా  
కొత్తగా 23,539 మందికి కరో­నా టీకా ఇచ్చారు. దీంతో మొత్తం టీకాలు 98,05,229 కి పెరిగాయి.  
తాజాగా 1,58,365 నమూనా లు పరీక్షించగా మొత్తం టెస్టులు 2,59,33,338 కి పెరిగాయి. 

కేసులు: టాప్‌-5 జిల్లాలు
బెంగళూరు      – 21,199 
మైసూరు      – 2,750 
తుమకూరు      – 1,302 
బళ్లారి      – 1,156 
దక్షిణ కన్నడ  – 996 

చదవండి: అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారిన అధికారి

మరిన్ని వార్తలు