60 ఏళ్లు పైబడ్డ వాళ్లు టీకా తీస్కోండి

7 Mar, 2021 06:21 IST|Sakshi
శనివారం బెంగళూరులో వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకుంటున్న ఇస్రో చైర్మన్‌ శివన్‌

టెస్ట్, ట్రాక్, ట్రీట్‌ పద్ధతి పాటించండి

కరోనా కేసులు పెరిగే రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: కొత్తగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని కేంద్రం కోరింది. 60 ఏళ్లు పైబడిన పౌరులు టీకా తీసుకోవాలని వృద్ధులకు సూచించింది. 3టీ(టెస్ట్, ట్రాక్, ట్రీట్‌) వ్యూహాన్ని అవలంబించాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.  మిషన్‌మోడ్‌లో కేసులు పెరిగే జిల్లాల్లో ప్రాధాన్యక్రమంలో  ప్రజలకు వ్యాక్సిన్‌ను సత్వరమే అందించాలని తెలిపింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులతో కలిసి పనిచేయాలని, 15– 28 రోజుల వ్యవధితో వ్యాక్సినేషన్‌ టైమ్‌టేబుల్‌ తయారు చేయాలని సూచించింది.  కేసులోడ్‌ పెరిగే ప్రాంతాల్లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులను పెంచాలని, నిఘా, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని తెలిపింది.

హరియాణా, ఏపీ, ఒడిశా, గోవా, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్‌ హెల్త్‌ సెక్రటరీలు, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రజేష్‌భూషణ్, నీతీ ఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ కే పాల్‌ శనివారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తీసుకుంటున్న ప్రజారోగ్య విధానాలపై కేంద్రం సమీక్ష జరిపారు. హరియాణాలో 15, ఏపీ, ఒడిశాల్లో 10, హిమాచల్, ఢిల్లీల్లో 9, ఉత్తరా ఖండ్‌లో 7, గోవాలో 2, చండీగఢ్‌లోని ఒక్క జిల్లా లో కోవిడ్‌ కేసులు అకస్మాత్తుగా ఉధృతమవడం,  టెస్టులు తగ్గించడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తక్కువగా జరగడం ఆందోళనకరమని తెలిపారు. ఇలాగే పరి స్థితి ఉంటే పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో మళ్లీ కరోనా పడగ విప్పవచ్చని హెచ్చరించారు. కేసులు గుర్తింç ³#, పేషెంట్ల ఐసోలేషన్, కాంటాక్ట్‌ ట్రేసింగ్, సూప ర్‌ స్ప్రెడ్‌ ఈవెంట్లపై నిఘానేత్రం వంటివి కరోనా వ్యాప్తిని తగ్గిస్తాయని వివరించారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు