పిల్లలకు టీకాలపై ఆరోగ్య శాఖ ప్రకటన

17 Jul, 2021 10:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అవన్నీ నిరాధార నివేదికలు

న్యూఢిల్లీ: భారతీయ చిన్నారులు కీలకమైన కోవిడ్‌ టీకాను పొందలేకపోతున్నారనే వార్తలు నిరాధారమని ప్రభుత్వం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్‌ నెగిటివ్‌ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.

ఈ సందర్భంగా... ఇవన్నీ నిరాధార నివేదికలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్‌ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది.  
 

మరిన్ని వార్తలు