వ్యాక్సిన్‌ : రామ్‌నాథ్ కోవింద్ సహా..పలువురు

3 Mar, 2021 14:54 IST|Sakshi

రాష్ట్రపతి  రామ్‌నాథ్‌ సహా వాక్సిన్‌ తీసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు

కపిల్‌ దేవ్‌, పీలే, చారుహాసన్‌ లాంటి దిగ్గజాలు వ్యాక్సిన్‌ స్వీకరణ

సాక్షి,  న్యూఢిల్లీ: దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  మొదటి దశలో  ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో  వరుసగా రెండో రోజు పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్‌ తొలిడోస్‌ను స్వీకరించారు. ముఖ్యంగా  రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌,  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, ‌మేఘాలయ గవర్నర సత్యపాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి  సహా, ఇతర రాజకీయ ప్రముఖులు వాక్సిన్‌  అందుకున్నారు. అలాగే  క్రికెట్‌ దిగ్గజం భారత మాజీ కెప్టెన్‌ కపిల్ ‌దేవ్‌, ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే, సీనీ రంగ ప్రముఖుడు చారుహాసన్‌, కూడా కరోనా టీకాను స్వీకరించడం గమనార్హం. మరోవైపు సీరం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీరంసీఈవో భార్య నటాషా పూనావాలా మంగళవారం వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు