కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!

1 May, 2021 21:31 IST|Sakshi

దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు తమకు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకు నేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా కేంద్రం అధికారిక వెబ్‌సైట్‌ కొవిన్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 28 నుంచి రిజిస్టర్‌ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది.

కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ:
► మీ మొబైల్ నంబర్‌ సహాయంతో కో-విన్ 2.0 పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
►ఇప్పుడు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.

► ఒకసారి రిజిస్టేషన్‌ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. 

►ఇప్పుడు మీకు షెడ్యూల్‌ అనే ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో మీరు టీకా వేసుకునేందుకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు.

►ఇందులో  పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేసి వెతికితే టీకా కేంద్రాల జాబితా కనిపిస్తోంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

► ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. 

స్లాట్లు లేకపోతే నేను ఏమి చేయాలి?
స్లాట్ల లభ్యత లేకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ అపాయింట్‌మెంట్ స్లాట్‌ల కోసం ప్రయత్నించండి. 

నేను అపాయింట్‌మెంట్ ను రీ-షెడ్యూల్ చేయవచ్చా?
చేయవచ్చు. కానీ, మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్న ముందు రోజువరకు మాత్రమే అవకాశం ఉంటుంది.

సెకండ్ డోస్ కోసం నేను మళ్ళీ నమోదు చేసుకోవాలా?
మొదటి మోతాదుకు టీకాలు వేసిన తర్వాత, యూజర్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ కోసం ఆటో మేటిక్ గా అపాయింట్‌మెంట్ కోసం షెడ్యూల్ చేయబడతారు. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రానికి నియామకాలను తిరిగి షెడ్యూల్ చేయవచ్చు.

టీకా కేంద్రానికి నేను తీసుకెళ్లవలసిన పత్రాలు ఏమిటి?
అపాయింట్‌మెంట్ నిర్ధారణ లేఖతో పాటు టీకా తీసుకునే సమయంలో ఆ వ్యక్తి కో-విన్ 2.0 పోర్టల్‌లో పేర్కొన్న ఫోటో ఐడిని తీసుకెళ్లాలి. 45 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాదులు ఉన్నవారు టీకా సమయంలో వైద్య ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి.

చదవండి: 

ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి!

మరిన్ని వార్తలు