-

కరోనా సెకండ్‌ వేవ్‌: రాబోయే 45 రోజులు ఎంత కీలకం...?

1 Apr, 2021 10:28 IST|Sakshi

భారీగా పెరుగుతున్న కేసులు.. సెకండ్‌ వేవ్‌లో పలు రాష్ట్రాలు

ఫస్ట్‌ వేవ్‌తో పోల్చితే సెకండ్‌వేవ్‌లో అలాకాదు..!

 నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో అధిక తీవ్రత

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తుందని అసలు ఎవరు ఊహించలేదు. సెప్టెంబరు ఆరంభం నుంచి ఫిబ్రవరి మధ్య  ఐదు నెలల్లో రోజువారీ కరోనా  కేసుల సంఖ్య దాదాపు 98,000 నుంచి కేవలం 10,000 కు పైగా నమోదుకావడంతో ​భారత్‌లో  ​సెకండ్‌ వేవ్‌  ఉండదనీ చాలా మంది అభిప్రాయపడ్డారు. కరోనాను నియంత్రించడంలో పూర్తిగా సఫలమయ్యామని అనుకున్న వారే  ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది.

భారీగా పెరుగుతున్న కేసులు.. సెకండ్‌ వేవ్‌లో పలు రాష్ట్రాలు
దేశంలో ఉత్తరప్రదేశ్‌,బీహార్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌,కేరళ, గుజరాత్‌ల్లో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. 139 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో నాలుగో వంతు జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌,బీహార్‌ రాష్ట్రాలల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు అత్యంత హీనదుస్థితిలో ఉన్నాయి.  2021 మార్చి 30 వరకు ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 615,996 కేసులు నమోదయ్యాయి, 8,800 మంది మరణించగా; బీహార్ లో  265,268 కేసులు, 1,574 మరణాలు సంభవించాయి. భారతదేశం మొత్తంగా ఈ కాలంలో 12.15 మిలియన్ కేసులు, 162,523 మరణాలు సంభవించాయి. పలు రాష్ట్రాల్లో గణనీయంగా పెరుగుతున్న కరోనా కేసులతో భారత్‌ స్పష్టంగా సెకండ్‌వేవ్‌ లోకి వెళ్తుతోందని తెలుస్తోంది. మహారాష్ట్ర, ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ లో ఉందని తెలుస్తోంది.

ఫస్ట్‌ వేవ్‌తో పోల్చితే సెకండ్‌వేవ్‌లో అలాకాదు..!
కరోనాతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ప్రపంచమంతా భయానక దృశ్యాలు కనిపించాయి. కరోనాను భారత్‌లో ఎదుర్కొవడానికి లాక్‌ డౌన్‌ కొంత ఉపశమనం కల్గించిన కొంత మంది ప్రజలకు ఎంతగానో నష్టాన్ని మిగిల్చింది. ఫస్ట్‌వేవ్‌ ప్రారంభంలో రోగానికి సరైన చికిత్స ఎంటో తెలియని అయోమయస్ధితిలో మెడికల్‌ సిబ్బంది ఉన్నారు. దాంతో ఎక్కువగా ప్రాణనష్టం వాటిల్లింది. కాగా ప్రస్తుతం భారత్‌లో  కరోనా సెకండ్‌ వేవ్‌ పడగలు చాస్తోంది. ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేయడానికి అనువైన అస్త్రాలు , చికిత్స, వ్యాక్సిన్‌లున్నాయి. ఒకవేళ ఇప్పుడు కరోనాకు సరైన చికిత్స, వ్యాక్సిన్‌లు లేకపోయింటే భీకరమైన పరిస్థితులు ఏర్పడేవి. లాక్‌ డౌన్‌లతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమయ్యేది.

 రానున్న రోజుల్లో తీవ్రత ఎంతగా ఉంటుంది..?
భారత్‌లో రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కేవలం  మహారాష్ట్ర లోనే 65 శాతం పైగా రికార్డు అవుతున్నాయి. మార్చి మొదటి ఏడు రోజులలో సగటున 7,500 నుంచి  మార్చి 30 వరకు ఏడు రోజులలో సగటున 25,000 వరకు కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఇతర కరోనా మ్యూటేషన్‌ కేసులు గణనీయంగా కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మే నెలల్లో  కరోనా తీవ్రత గరిష్టంగా కేసుల నమోదవుతాయని స్పష్టంగా అర్థమవౌతోంది.

ప్రస్తుతం దేశంలో చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో కొద్దిగా కరోనా తీవ్రతను తగ్గించవచ్చును.  కాగా  రాబోయే 45 రోజులలో దేశంలో వ్యాక్సిన్‌  ప్రక్రియ వేగంగా లభిస్తే, సెకండ్‌ వేవ్‌  మే నెలలో లేదా  మధ్యలో  అయిన తీవ్రత నియంత్రణలోకి వస్తుంది. అలా చేయకపోతే, దేశంలో వ్యాధి సంక్రమణ నుంచి తప్పించుకోలేదు. దాంతో పాటు  ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. సుదీర్ఘమైన సెకండ్‌ వేవ్, చెదురుమదురు లాక్‌ డౌన్‌లు, నిరంతర ఆంక్షలు ఆర్థిక వ్యవస్థకు కుదిపేస్తాయి . కరోనావైరస్ వ్యాప్తిని సులువుగా తీసుకుంటే ముందుంది ఎండ్‌గేమ్‌ అని చెప్పవచ్చును.

చదవండి: యూట్యూబ్‌ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్‌కి చెక్ పెట్టనుందా?

మరిన్ని వార్తలు