సరికొత్త మాస్కు.. దీనితో ఇలా ఈజీగా మాట్లాడొచ్చు!

24 May, 2021 13:02 IST|Sakshi

సాక్షి. తిరువనంతపురం: దేశంలో కరోనా మహమ్మారి అల్లాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి తోడు ప్రతి ఒక్కరు ముక్కుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయ్యింది.

ఈ క్రమంలో కోవిడ్‌ను నుంచి రక్షణ పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఈనేపథ్యంలోనే కేరళకు చెందిన బీటెక్ విద్యార్థి కెవిన్‌ జాకబ్ సరికొత్త మాస్క్‌ను తయారు చేశాడు. మాస్కు ధరించినప్పటికీ వ్యక్తుల మధ్య సంభాషణలను సులభతరం చేయడానికి మైక్, స్పీకర్‌తో కూడిన మాస్క్‌ను రూపొందించాడు. ప్రస్తుతం వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నిరంతరం మాస్క్‌లతోపాటు పీపీఈకిట్‌లు ధరించడం వల్ల సరిగా కమ్యూనికేట్‌ చేయలేకపోతున్నారు.

అయితే ఈ స్పీకర్‌ మాస్క్‌ ద్వారా వైద్యులు.. కోవిడ్‌ బాధితుల‌తో సుల‌భంగా మాట్లాడేందుకు వీలు కలుగుతుంది. దీనిని 30 నిమిషాలు చార్జ్‌ చేస్తే ఆరు గంటలపాటు నిర్విరామంగా ఉపయోగించవచ్చని కెవిన్‌ తెలిపాడు. డాక్టర్లైన తన తల్లిదండ్రులు, పేషెంట్లతో కమ్యూనికేట్‌ అవడానికి పడే కష్టాలను చూసి ఈ మాస్క్‌ తయారు చేయాలన్న ఆలోచన కలిగినట్లు పేర్కొన్నాడు. ఇది అయస్కాంతం ద్వారా మాస్క్‌కు అంటించడం జరగుతుందన్నారు.

చదవండి: లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. స్టెప్పులేసిన మహిళా తహసీల్దార్‌ 
వైరల్‌: పెళ్లితో ఒక్కటైన జంట.. భూమ్మీద కాదండోయ్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు